Header Banner

పాక్‌ను నమ్మొద్దు! భారత్‌కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరిక!

  Mon May 12, 2025 15:00        India

భారత్ కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ కీలక సూచన.పాకిస్థాన్ ఊసరవెల్లి లాంటిది, దానిని నమ్మొద్దని విజ్ఞప్తి.శాంతి, సోదరభావం అంటూ పాక్ చెప్పే మాటలన్నీ మోసపూరితమని మండిపాటు.బలూచిస్థాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బీఎల్ఏ.

 

భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోజుల తరబడి వినిపించిన కాల్పుల మోతలు, బాంబు పేలుళ్ల శబ్దాలు ప్రస్తుతం వినిపించడం లేదు. అయితే, ఈ ప్రశాంతత తాత్కాలికమేనని, పాకిస్థాన్ ను నమ్మొద్దని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పరోక్షంగా భారత్ కు సూచించింది. పాక్ ఊసరవెల్లిలాంటిదని, దాని మాటలను నమ్మవద్దని పేర్కొంది. భారత సైన్యం ధాటికి తట్టుకోలేక, సైనిక ఘర్షణను ఆపేందుకు పాకిస్థాన్ తాత్కాలిక యుద్ధ వ్యూహంగా ఈ శాంతి, సోదరభావం ప్రవచనాలు చెబుతోందని మండిపడింది. కాల్పుల విరమణ ఒక మోసమని, తాత్కాలికమేనని బీఎల్ఏ పేర్కొంది.

 

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత బలమైన సైన్యం.. ఈ దేశాలకే.. భారత్ స్థానం ఎంతంటే?

 

తనపై వస్తున్న ఆరోపణలపైనా బీఎల్ఏ స్పందించింది. విదేశీ మద్దతున్న పార్టీ అంటూ వస్తోన్న విమర్శలను తోసిపుచ్చింది. ‘‘ప్రస్తుతం బలూచిస్థాన్ ప్రాంతానికి సంబంధించి సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది. మేమేమీ కీలుబొమ్మలం కాదు, ఏం జరిగినా మౌనంగా చూస్తూ ఉండిపోము. బలూచిస్థాన్ లో మా పాత్ర ఏమిటనే దానిపై మాకు పూర్తి స్పష్టత ఉంది’’ అని వెల్లడించింది. పాకిస్థాన్ భూభాగంలోని బలూచిస్థాన్ లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎడారి వాతావరణం కారణంగా అది అత్యంత వెనుకబడి ఉంది. పాక్ ఖజానాకు గణనీయమైన ఆదాయం ఇక్కడి నుంచే వస్తున్నప్పటికీ బలూచిస్థాన్ అభివృద్ధి విషయంలో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వేర్పాటువాదం పురుడు పోసుకుంది. ప్రత్యేక బలూచిస్థాన్ కోసం స్థానికులు దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

  

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Balochistan #BalochLiberationArmy #BLAStatement #IndiaPakistanTensions #CeasefireReality #BalochStruggle